కర్ణాటక సీఎం పీఠంపై సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య కోల్డ్ వార్ ముదిరింది. రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు డీకే యత్నించగా.. ‘వెయిట్ చేయండి, నేనే కాల్ చేస్తా’ అని రాహుల్ మెసేజ్ పెట్టినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో డీకే హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది. అక్కడ సోనియాను కలిసి నాయకత్వ మార్పుపై డీకే చర్చించనున్నట్లు తెలుస్తోంది.