BHPL: పంచాయతీ ఎన్నికల్లో SC, ST, BC, మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించినా మహాముత్తారం, పలిమెల మండలాల్లో క్షేత్రస్థాయిలో అమలు సక్రమంగా జరగలేదని ప్రజలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. బీసీలకు 22% రిజర్వేషన్ ఉన్నప్పటికీ మహాముత్తారం మండలంలోని 24 పంచాయతీల్లో, పలిమెలలోని 8 పంచాయతీల్లో ఒక్క బీసీ రిజర్వేషన్ కూడా కేటాయించకపోవడంతో బీసీ సమాజంలో తీవ్ర నిరసన నెలకొంది.