ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల వేడి జోరుగా ఉంది. రేపటి నుంచి కేవలం ఐదు రోజుల్లోనే నామినేషన్లు ముగియడంతో పార్టీలు ఒత్తిడిలో పడ్డాయి. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు కుదరకపోవడం ప్రతిపక్షాలకు తీవ్ర ఇబ్బంది. సర్పంచ్-ఉపసర్పంచ్ చెక్ పవర్ వల్ల ఖర్చు ఎక్కువ, లాభం తక్కువేనని నాయకులు భావిస్తూ గ్రామ పెద్దలను “టికెట్ కావాలా..?” అని అడుగుతున్నారు.