AP: పల్నాడు కేశనపల్లిలో అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కోనసీమ కొబ్బరి మీద BC రోశయ్య రిపోర్ట్ గురించి అధికారులను అడిగారు. దీంతో ఆ నివేదిక గురించి తెలియదని చెప్పారు. తన దగ్గర BC రోశయ్య రిపోర్ట్ ఉందని.. అధికారుల దగ్గర ఎందుకు లేదని ప్రశ్నించారు. ఇప్పటికే దాని మీద అవగాహన ఉండాలని.. BC రోశయ్య నివేదికను స్టడీ చేయాలని పవన్ ఆదేశించారు.