GNTR: పొన్నూరు పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ దృష్టి సారించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన రూ.36.57 లక్షల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పాత పంచాయతీ ఆఫీస్ వద్ద రూ.26 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైన్‌ను ప్రారంభించారు. అనంతరం చేనేత సొసైటీ ఎదుట రూ.10.57 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రజలకు అంకితం చేశారు.