దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శి అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇదే మూలమని చెప్పారు. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను కల్పించిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని.. దీనిలో భాగమే EWS రిజర్వేషన్లు అని వెల్లడించారు.