ADB: పంచాయతీ రిజర్వేషన్లో బీసీలకు అన్యాయం జరిగిందని మండల నాయి బ్రాహ్మణ సంఘం నాయకుడు మాదాసు ప్రవీణ్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో సంఘం నాయకులతో సమావేశమై మాట్లాడారు. మండలంలోని 32స్థానాలకు గాను ఎస్టీలకు 18, ఎస్సీలకు 02, జనరల్ 12 స్థానాలు కేటాయించగా బీసీలకు ఒక్క స్థానాన్ని కేటాయించ లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై కలెక్టర్ చొరవ చూపాలని కోరారు.