చలికాలంలో రోజూ మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే నీరసం, అలసట, బద్ధకం తగ్గి యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను దూరం చేస్తుంది.