ATP: జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పూల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి మంగళవారం రాత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు అభివృద్ధి పనులపై సీఎంతో చర్చించారు. జిల్లాలో పార్టీ కార్యకలాపాలను మరింత ఉధృతం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు.