HYD: డిసెంబర్ 31 రాత్రి పబ్బులు, 3 స్టార్ హోటళ్లలో జరిగే వేడుకలకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. శబ్ద కాలుష్య నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈవెంట్లలో గంజాయి, మాదకద్రవ్యాలు, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా… లైసెన్సులు రద్దుచేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.