NLG: దేవరకొండలోని తెలంగాణ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.హరిప్రియ తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని మతాలను గౌరవించడం మన సంప్రదాయం అన్నారు. పరమత సమ్మేళనం,సాంప్రదాయ విలువలు నేటి తరం పిల్లలు నేర్చుకోవాలని పలు సూచనలు చేశారు.కార్యక్రమంలో విద్యార్థినులు,అధ్యాపక బృందం పాల్గొన్నారు.