ELR: చింతలపూడి పట్టణంలో నిషేధిత గ్లైసిల్ ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కలుపు మొక్కలకు ఉపయోగించే గ్లైసిల్ పెస్టిసైడ్ ను అధిక మోతాదులో విషపూరితమని ప్రభుత్వం నిషేధించింది. కానీ కొన్ని పురుగు మందుల షాపులు దొంగచాటుగా గ్లైసిల్ అమ్మకాలు సాగిస్తున్నారు. ఇవాళ చింతలపూడిలో పురుగుమందుల షాపులపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.