AP: మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రెస్మీట్లో కంటతడి పెట్టుకున్నారు. తన కుటుంబం, పీఏపై తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. నెల రోజులుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని తెలిపారు. కాగా, మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామ చేసిన విషయం తెలిసిందే.