WGL: చాకలి ఐలమ్మ విగ్రహానికి అడ్డంగా ఏర్పాటు చేసిన భారత్ గ్యాస్ ఫ్లెక్సీ బోర్డును తొలగించాలని రజక సంఘం ఆధ్వర్యంలో నల్లబెల్లి గ్రామ సర్పంచ్ జ్యోతికి ఇవాళ వినతిపత్రం అందజేశారు. సందర్భంగా సంఘ నాయకుడు నారాయణ మాట్లాడుతూ.. అధికారుల సహకారంతో నిర్మిస్తున్న చాకలి ఐలమ్మ విగ్రహం అడ్డంగా ఉన్న ఫ్లెక్సీ బోర్డు తొలగించకుండా ఇబ్బంది వారిపై చర్య తీసుకోవాలని అన్నారు.