తమిళ స్టార్, TVK అధినేత విజయ్ దళపతిని మలేషియా పోలీసులు హెచ్చరించారు. ఈ నెల 27న కౌలాలంపూర్లో విజయ్ సినిమా ‘జన నాయగన్’ గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడవద్దని ఆంక్షలు విధించారు. ఇక ఈ ఈవెంట్కు దాదాపు 90 వేల అభిమానులు వస్తారని సమాచారం. కాగా, ఈ మూవీ 2026 జనవరి 9న విడుదల కానుంది.