TG: రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన KCR మంచి మాటలు చెబుతారని అనుకున్నానని CM రేవంత్ అన్నారు. వాళ్ల MLAలు, మంత్రులు ఎన్నో పాపాలు చేశారని ఆరోపించారు. కానీ తాను ఎవరిపైనా కేసు పెట్టలేదని, వేధించలేదని చెప్పారు. ఎవరి పాపాన వాళ్లే పోతారని సైలెంట్‌గా ఉన్నానని తెలిపారు. తమ తోలు తీస్తానని KCR అంటున్నారని.. కాంగ్రెస్ సర్పంచ్‌లే BRS వాళ్ల తోలు తీస్తారని వ్యాఖ్యానించారు.