KNR: శంకరపట్నం మండలం తాడికల్లో పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ జరిగింది. గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత పాల్గొన్నారు. తాడికల్లో 552, గొల్లపల్లిలో 2850 జీవాలకు మందులు అందించినట్లు పశువైద్యుడు డా. మాధవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, గోపాలమిత్రలు, గ్రామ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.