BHPL: గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో బుధవారం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన వార్డు సభ్యులు, గెలుపుకు కష్టపడిన కార్యకర్తలను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.