JGL: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేయగా, జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో వాటర్ ట్యాంకులు, వాటర్ సంప్, పై ప్లాన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జిల్లా సంస్థల అదనపు కలెక్టర్ రాజగౌడ్ కోరుట్ల మున్సిపల్ పరిధిలో అమృత్ 2.0 పథకం కింద జరుగుతున్న పనులను లే అవుట్,బయో మైనింగ్ లో భాగంగా డంప్ యార్డులను పరిశీలించారు.