PDPL: మంథని నియోజకవర్గంలోని బట్టుపల్లి గ్రామానికి చెందిన పొలం మల్లేష్‌కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రూ.2,50,000 ఎల్ఓసీ మంజూరు చేయించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మల్లేష్ వైద్య చికిత్స కోసం ఈ ఆర్థిక సహాయం అందించి, సదరు కుటుంబానికి మంత్రి అండగా నిలిచారు. దీంతో ఆ కుటుంబం మంత్రికి ధన్యవాదాలు తెలిపింది.