MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్లో ముందస్తుగా ఇవాళ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాంతాక్లాజ్ వేషధారణలో పిల్లలు ఆకట్టుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ముత్తినేని జయప్రకాష్ మాట్లాడుతూ.. యుగకర్త ఏసుక్రీస్తు జన్మదిన ప్రపంచానికి పండుగ రోజు అని వివరించారు.