VZM: నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత తాడ్డి సత్యనారాయణను జిల్లా అధికార ప్రతినిధిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదవి ఇచ్చినందుకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున, తదితర నాయకులకు సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.