CTR: క్రిస్మస్ సందర్భంగా పుంగనూరులోని క్రైస్తవ ప్రార్థన మందిరాలు నూతన శోభను సంతరించుకున్నాయి. నాగపాళ్యం సీఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చి, MBT రోడ్డులోని చర్చిని రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ప్రార్థన మందిరాలు, చర్చిలు విద్యుద్దీపాలతో వెలిగిపోతున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచే వేడుకలు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.