ELR: విదేశీ పక్షుల రాకను పురస్కరించుకుని కొల్లేరు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం ఏలూరులో కలెక్టర్ మాట్లాడారు. పర్యాటకులను ఆకర్షించేలా 2 రోజుల పాటు ఈ వేడుకలు జరపాలన్నారు. ఇందుకు అనువైన తేదీలను ఖరారు చేసి, ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీని నియమించాలన్నారు.