AP: క్రైస్తవ సోదరులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. శాంతిదూత ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం మనందరి జీవితాల్లో కొత్త వెలుగు నింపాలని కోరుకున్నట్లు చెప్పారు. కీస్తు చూపిన ప్రేమ, క్షమ, సహనం, సేవ వంటి విలువలు ఈనాటి సమాజానికి మరింత అవసరమన్నారు. క్రైస్తవ మత విశ్వాసాన్ని నిలబెట్టే పాస్టర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.