TG: రవాణాశాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. జనవరిలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రతి జిల్లాలో చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాద నివారణే లక్ష్యంగా అధికారులు పనిచేయాలన్నారు.