BHNG: జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా కేంద్రం ఆస్పత్రిలో సమస్యలు అనేకం ఉన్నాయని స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని DYFI జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రం ఆస్పత్రిని సందర్శించి వారు మాట్లాడుతూ.. జిల్లాలో పాలకులు మారిన ప్రభుత్వాలు మారిన ఆసుపత్రులు మాత్రం మారడం లేదన్నారు.