NZB: కేసీఆర్‌కు ఛాలెంజ్ విసిరే రేంజ్ సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్‌తో పెట్టుకుంటే మాడిమసై పోతరు అని ఆయన హెచ్చరించారు. రేవంత్‌కు కేసీఆర్‌ను తిట్టందే రోజు గడవదని ఆయన ధ్వజమెత్తారు. నిద్రలో కూడా కేసీఆర్, కేటీఆర్ పేరునే కలవరిస్తుండని ఎద్దేవా చేశారు.