NLG: శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్లగొండ క్యాంప్ ఆఫీసులో ఇవాళ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఫాదర్ రెవరన్ జీవన్, ఫాదర్ రెవరెండ్ కిరణ్ ప్రపంచ శాంతిని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సుఖేందర్ రెడ్డి కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ శాంతితో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.