NZB: భీమ్గల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు అన్నారు. పట్టణంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.