PDPL: జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ డి. వేణు మాట్లాడుతూ.. వినియోగదారులు కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. వస్తువుల ధర, నాణ్యత, గడువు తేదీని జాగ్రత్తగా పరిశీలించాలని, మోసపోయినప్పుడు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాలని తెలిపారు.