TG: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. అహంకారంతో అరుస్తున్నావా? రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది. వికృత మనస్తత్వంతో చావులు కోరుతున్నావు. అసెంబ్లీలో నీ జలద్రోహాన్ని ఎండగడతాం. 2028లో కాంగ్రెస్ను ప్రజలు బొంద పెట్టడం ఖాయం. వందేళ్ల వరకు పుట్టగతులు లేకుండా చేయడం తథ్యం’ అని ధ్వజమెత్తారు.