NZB: TU పరిధిలోని B.Ed, B.P.Ed మొదటి, మూడవ రెగ్యులర్ సెమిస్టర్ల పరీక్షల ఫీజు చెల్లింపుకు ఈ నెల 27 ఆఖరు తేదీ అని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ విద్యార్థులకు సూచించారు. జనవరిలో నిర్వహించనున్న పరీక్షలకు సంబంధించి సంబంధిత కళాశాలల్లో ఫీజులు చెల్లించాలన్నారు. అపరాధ రుసుము రూ.100తో ఈ నెల 29 లోపు కూడా చెల్లించవచ్చన్నారు.