AP: పీపీపీ విధానంపై ముందుకే వెళ్లాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదన్నారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే VGFకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీని కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30 శాతం చొప్పున ఆర్థిక సాయం చేస్తాయని చెప్పారు.