NZB: నగర శివారులోని ఖానాపూర్‌లో కొనసాగుతున్న KCP న్యూట్రిషన్ రైస్ మిల్లును కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నేడు తనిఖీ చేశారు. పోషకాలతో కూడిన ఫోర్టి ఫైడ్ కెన్నెల్ రైస్‌ను ఉత్పత్తి చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందిస్తున్న సన్న బియ్యంలో పోషకాల కోసం ఈ ఫోర్టి ఫైడ్ రైస్‌ను కలిపి పంపిణీ చేస్తోందని ఆయన తెలిపారు.