MLG: జిల్లా కేంద్రంలో రూ. 1.50 కోట్లతో వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి బుధవారం రాష్ట్ర మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. స్థలం కేటాయించిన కలెక్టర్ దివాకర్ టీఎస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ములుగు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, DCC అధ్యక్షుడు అశోక్, తదితరులు ఉన్నారు.