కృష్ణా: సీతనపల్లిలో బుధవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. దైవ సేవకులతో కలిసి కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు ముందస్తు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ శాంతి, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు ప్రతీక అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.