MHBD: ప్రమాదవశాత్తు బావిలో మునిగి రైతు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గార్ల పోసలతండాకు చెందిన భూక్య రంగీలా (40) బుధవారం వ్యవసాయ బావిలోకి దిగి మోటర్ పైకి తెస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. రంగీలా మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.