గూగుల్ తమ ప్రీమియం ఏఐ, క్లౌడ్ స్టోరేజీ సేవలపై భారీ తగ్గింపును ప్రకటించింది. పరిమిత కాలానికి వార్షిక సబ్స్క్రిప్షన్లపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ గూగుల్ ఏఐ ప్రో, ప్రీమియం గూగుల్ వన్ ఎంచుకునే కొత్త సబ్స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.