EG: కోరుకొండ గ్రామంలో పేరయ్య గుండి చెరువు ఆక్రమణకు గురైందని బీజేపీ ఓబీసీ మోర్చా నాయకులు పచారి నరసింహమూర్తి పేర్కొన్నారు. చెరువును కొంతమంది దళారులు ఆక్రమించారని, గ్రామ పంచాయతీకి చెందినదిగా ఆర్డీఓ అధికారి నిర్ధారించిన పత్రాలను ఎమ్మార్వోకి ఆయన బుధవారం అందజేశారు. త్వరతిగతిన అధికారులు ఎంక్వేరి జరిపి చెరువును పంచాయతీకి అప్పగించాల్సిందిగా కోరారు.