వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో శానిటేషన్, హార్టికల్చర్ అధికారులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. నగరంలో పారిశుధ్యం, పచ్చదనం మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.