NLG: పెన్షనర్ల న్యాయమైన డిమాండ్ల సాధనకై నల్గొండలో గురువారం భారీ నిరసన దీక్ష నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర పరిశీలకుడు గోపాల్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, వైద్య సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు.