RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్లో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సర్పంచులు కీలక పాత్రగా ఉంటారని, గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించి బీజేపీపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు.