SKLM: ఆరుతడి పంటలలో అధికంగా యూరియాను వినియోగిస్తే క్రిమి కీటకాదులు చీడపీడల బాధలు అధికంగా ఉంటాయని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చరల్ జగన్మోహనరావు అన్నారు. బుధవారం కోటబొమ్మాళి మండలం వాండ్రాల గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. సెనగ, పెసర, మినుము వంటి పంటలలో యాజమాన్య పద్ధతులను వివరించారు. అలాగే మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు ఆశిస్తుందని అన్నారు.