విశాఖపట్నంలోని విశాఖ పోర్టు స్టేడియంలో పెసా ఉత్సవ్ సందర్భంగా అరుకు కాఫీ, గిరిజన ఉత్పత్తులతో కూడిన కిట్‌ను పంచాయతీరాజ్ సెక్రటరీ వివేక్ భరద్వాజుకు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఎండీ కల్పనా కుమారి అందజేశారు. బుధవారం పెసా ఉత్సవ్ రెండో రోజు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జీసీసీ ఎండీ కల్పనా కుమారి అతిథిగా హాజరయ్యారు.