NLG:హైదరాబాద్లో జనవరి 25-28 వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు జరుగుతాయని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి తెలిపారు. ఇవాళ మిర్యాలగూడలో విలేకరులతో మాట్లాడారు. దేశం నలుమూలల నుంచి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. మహిళలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.