KMM: రాష్ట్ర ప్రభుత్వం కల్పించే అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ముష్టికుంట్ల గ్రామ సర్పంచ్ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం బోనకల్ మండలం ముష్టికుంట్ల రైతు వేదిక నందు ఇందిరా మహిళ డైరీ పథకంపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళ డైరీ పథకంతో మహిళలు వ్యాపారంలో రాణించాలన్నారు.