SKLM: వైసీపీ వాళ్ల పిచ్చి పరాకాష్టకు చేరింది, ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలి అని రాష్ట్ర కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ కృష్ణం నాయుడు అన్నారు. నరసన్నపేటలో స్థానిక ప్రజా సదన్‌లో ఇవాళ సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి కొంతమంది కనీస పరిజ్ఞానం, విలువలు పాటించకుండా తప్పుడు ప్రచారాలు చెయ్యడం చాలా దౌర్భాగ్యం అన్నారు.