PDPL: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఖానాపూర్ సర్పంచ్ సంగెం అరుణ గ్రామంలోని 6వ వార్డులో అర్ధాంతరంగా నిలిచిపోయిన బోరుబావి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయించి, ఇవాళ మోటారును ప్రారంభించారు. ఉప సర్పంచ్ గుంజ సత్యనారాయణతో కలిసి నీటి సరఫరాను పునరుద్ధరించారు. బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే నీటి సమస్యను పరిష్కరించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.