HYD: బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఉదయనగర్ బస్తీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రమణ బుధవారం కమిటీ సభ్యులతో కలిసి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీని ఎమ్మెల్యే అభినందించారు. బస్తీలో సమస్యల పట్ల, అభివృద్ధి పనుల పట్ల ఫోకస్ చేయాలని ఎమ్మెల్యే అధ్యక్షుడు రమణకు సూచించారు. సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.